హెల్త్ సబ్‌సెంటర్‌కు తాళం
తుంగతుర్తి : మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్‌కు తాళం పడింది. దీంతో వారం రోజులుగా సేవలు నిలిచిపోయాయి. తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.2వేలు చెల్లించాల్సి ఉంది. సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యాజమాని తాళం వేశాడు. సంబంధిత అధికా రులను అడిగితే దాటవేస్తూ వస్తున్నారని యజమాని వాపోయాడు. నెలకు రూ.2వేల చొప్పున రెండేళ్లకు రూ.48 వేలు రావాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని, లేదా కార్యాలయాన్ని ఖాళీ చేయాలని వాపోయాడు.
నిరీక్షించి వెళ్తున్న ఆరోగ్య సిబ్బంది
అక్కడ పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది రోజూ యథావిధిగా విధులకు వచ్చి, నిరీక్షించి వెళ్తున్నారు. హెల్త్ సెంటర్‌కు వచ్చిన రోగులు సైతం తాళం వేసి ఉండటంతో వెనుదిరిగి పోతున్నారు.
ఫ 48 నెలలుగా అద్దె పెండింగ్
ఫ తాళం వేసిన యజమాని


