
ఈత, తాటి వనాలతో జీవనాధారం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఈత, తాటి వనాలు గౌడ కుటుంబాలకు జీవనాధారం అని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో గౌడ సొసైటీ భూమిలో నాలుగు ఎకరాల్లో కలెక్టర్ ఈత మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. నాటిన మొక్కలను చంటి బిడ్డల్లా కాపాడి పెంచి పెద్ద చేసినప్పుడే ప్రయోజనం కలుగుతుందన్నారు. 1,600 ఈతమొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణకు నీటి కోసం బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నీటి తొట్టెలు నిర్మించి వాటి ద్వారా మొక్కలకు నీరు పోసి పెంచాలని సూచించారు. ఫెన్సింగ్ మంజూరు చేసి డ్రిప్ సౌకర్యం కల్పించాలని గౌడ సొసైటీ బాధ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీఆర్‌డీఓ అప్పారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్, ఆర్‌డీఓ వేణు మాధవరావు, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ మహ్మద్ హాసీం, కార్యదర్శి స్వప్న, గౌడ సొసైటీ చైర్మన్ వెల్గూరి జానయ్య, మల్లయ్య, తండు నాగలింగం, బాలయ్య, రాజు, నేతలు తంగళ్ల కరుణాకర్ రెడ్డి, ముసుగు రామచంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, శివ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేశారు
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు చేరే విధంగా డీపీఆర్‌ఓ రమేష్ కుమార్ అంకిత భావంతో పని చేశారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన డీపీఆర్‌ఓ రమేష్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో మంత్రుల పర్యటనలను విజయవంత చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు, పదవీ విరమణ పొందిన డీపీఆర్‌ఓ రమేష్‌కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ పాతసూర్యాపేటలో వనమహోత్సవం