
ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
చివ్వెంల(సూర్యాపేట) : ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న జ్యూడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోర్టులో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మధుసూదన్‌రావు ,ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, కోశాధికారి జునైద్, అసోసియేట్ అధ్యక్షుడు ఎ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె.వి.శ్రీకాంత్, ఎ.ఉమ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.మహేశ్వర్, జాయింట్ సెక్రటరీలు పి.నాగంజనేయులు, ఎ.మధుకర్, కె.నాగరాజు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
లక్ష్మీశారద