
చేయూత పింఛన్లు పెంచేవరకు పోరు
హుజూర్‌నగర్ : ప్రభుత్వం చేయూత పింఛన్లు పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో చేయూత పింఛన్‌దారుల జిల్లా సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని, వికలాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో మంత్రుల నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించిన అనంతరం ఈనెల 13న హైదరాబాద్‌లో చేయూత పింఛన్‌దారుల మహా గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ మహాగర్జనకు పింఛన్‌దారులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బివెంకటేశ్వర్లు, సీహెచ్.వినయ్ బాబు, ఆర్ సురేష్, సీహెచ్.నాగయ్య, బి.ప్రసాద్, ఒగ్గు విశాఖ, ఎం.వెంకటేశ్వర్లు, శరత్‌బాబు, ఎం.నాగరాజు, రాజేష్, శరత్, ఖాసీం, సతీష్, వినయ్, శ్రీనివాస్, రవీందర్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మంద కృష్ణమాదిగ