
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
సూర్యాపేట : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రామ్‌కోటి ప్రజాపతి, రాష్ట్ర నాయకుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించే 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష వాల్ పోస్టర్లను శుక్రవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్ హాల్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. నిరాహార దీక్షకు 30 కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల సైదులు, రెడ్డబోయిన నరేష్, కె.వీరబాబు, సట్టు మురళి, వేముల వీరమల్లు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గొట్టిపర్తి లింగయ్య, ఎలకపల్లి సైదులు, ప్రవీణ్, రాచమల్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.