
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మోతె : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనణ కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మోతె పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లు, బ్లడ్ టెస్టులు, మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌సీ చెకప్‌కు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య విషయాలను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు వైద్యధికారులు కృషి చేయాలన్నారు. ఎక్కడైన డెంగీ కేసులు గుర్తిస్తే వారి ఇంటి పరిసరాల్లో శానిటేషన్ చేయించాలన్నారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం తీసుకుంటే శిశువులో ఎదుగుదల ఉంటుందన్నారు. భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాంపురంతండాలో ఎస్సారెస్పీ 22–ఎల్ కాల్వను పరిశీలించి సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, పీహెచ్‌సీ డాక్టర్ యశ్వంత్, ఆయుష్ డాక్టర్ వాణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్