సూర్యాపేట అర్బన్ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ ప్రో కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఈనెల 3న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం (ఇండోర్)లో జరగనున్నట్లు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి , నామా నరసింహా రావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర యువ ప్రో కబడ్డీ లీగ్ పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల సూర్యాపేట జిల్లా క్రీడాకారులు ఈనెల2లోపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సెల్ నంబర్ 9912381165ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
అనంతగిరి: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ వెంట మండల వైధ్యాధికారి డాక్టర్ పుష్పలత, పీహెచ్‌ఎన్ అనంతలక్ష్మి, స్టాఫ్ నర్సు ధనలక్ష్మి, ఫార్మసిస్ట్ కృష్ణ తదితరులు ఉన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
పెన్‌పహాడ్: విద్యార్థులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈఓ అశోక్ సూచించారు. గురువారం పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయం, సింగారెడ్డిపాలెంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి నూరుశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు కృష్ణప్రసాద్, పీడీ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు నరేందర్, ఉపాధ్యాయులు నల్లా శ్రీనివాసులు, మహేష్, సరిత పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్
కార్యదర్శిగా మమత
భానుపురి (సూర్యాపేట ) : యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన మమతా నాగిరెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , కేసి వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి మమతానాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
3న ప్రో కబడ్డీ పోటీలు
3న ప్రో కబడ్డీ పోటీలు