
అమ్మ పాలు అమృతం
అవగాహన సదస్సులు నిర్వహిస్తాం
అమ్మపాల విశిష్టత తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. గర్భిణులు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. – దయానందరాణి,
జిల్లా సంక్షేమ శాఖ అధికారి
సూర్యాపేట అర్బన్ : అమ్మ పాలు అమృతంతో సమానమని పెద్దల మాట. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను అందించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు పట్టిస్తేనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు.
ముర్రుపాలు తప్పనిసరి
బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను శిశువుకు తప్పనిసరిగా పట్టించాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహారం అందుతుంది. ఈ పాలలో మాంసకృత్తులు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన గంట నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వకూడదు. రోజూ ఎనిమిది నుంచి పదిసార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ నేటి నుంచి 7వ తేదీ వరకు
తల్లిపాల వారోత్సవాలు

అమ్మ పాలు అమృతం