
లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలి
భానుపురి (సూర్యాపేట) : లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్లయ్య డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ గురువారం టీయూసీఐ(ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేటలో ఆ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు గులాం హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న,జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి, సాహెబ్ హుస్సేన్, కస్తాల కృష్ణ, రజాక్, మోహన్, అంజయ్య, సైదులు పాల్గొన్నారు.