ఒట్టు..అవన్నీ ఓటు హామీలే! | - | Sakshi
Sakshi News home page

ఒట్టు..అవన్నీ ఓటు హామీలే!

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

Simultaneously Printed at Srikakulam | Vijayawada | Chennai | Delhi | Bangalore | Hyderabad | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | Rajamahendravaram | Tadepalli Gudem | Tirupathi | Visakhapatnam | Warangal

పల్లెపోరుకు సిద్ధం

● ఒక్క హామీనీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం

● రెండున్నరేళ్లుగా మాయమాటలతో గారడీ

● పబ్లిసిటీతో ప్రజల కళ్లకు గంతలు

లోకేష్‌ ఇలా..

● కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బొంతు, కామేశ్వరిపేట ఎత్తిపోతల పథకాలు పూర్తి, వంశధార ప్రాజెక్టు, పెండింగ్‌లో ఉన్న వనితమండలం వంతెన, ఆమదాలవలస– పోలాకి వంతెన పూర్తి చేస్తామన్నారు. వీటిలో ఒక్కటీ ముందుకు కదల్లేదు. నాగావళి– వంశధార నదిపై పురుషోత్తపురం వద్ద వంతెన నిర్మిస్తామని, ఆమదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని, జిల్లాలో సెజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు.

చంద్రబాబు అలా..

● అధికారంలోకి రాగానే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ, ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు, పలాసలో కేంద్రీయ విద్యాలయం, నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం, వంశధార– బాహుదా నదుల అనుసంధానం, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం.. ఇలా ఒకటా రెండా జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీల వర్షం కురిపించారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు.

పల్లెపోరుకు సిబ్బంది సన్నద్ధమయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుని తమకు నిర్దేశించిన బూత్‌లకు సామగ్రితో సహా తరలివెళ్లారు. ఈ క్రమంలో పలుచోట్ల సిబ్బందికి భోజనాలు, ఇతర సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు ఎదురయ్యాయి. – సాక్షి నెట్‌వర్క్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

సూపర్‌ సిక్స్‌ అన్నారు..అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు..రోడ్లను అద్దాల్లా మెరిపిస్తామన్నారు..అయితే అవన్నీ ఓట్లు వరకే అని ప్రజలకు అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. చంద్రబాబు అంటేనే మోసం అని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇదే మాట జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా చెబుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లాలో కూటమి అభ్యర్థుల నోట మళ్లీ అవే రకమైన హామీలు విని నవ్వుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోసం, దగాచేయడం తెలుగుదేశం, కూటమి అభ్యర్థులకు అలవాటుగా మారిపోయిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా కూటమి హామీల్లో కొన్ని..

టెక్కలి: వైద్య కళాశాల, వంశధార ప్రధాన కాలువకు సిమెంట్‌ లైనింగ్‌, శివారు ప్రాంతానికి సాగునీరు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలి అభివృద్ధి, భావనపాడు నుంచి విశాఖ వరకు సాగర కారిడార్‌ నిర్మాణం, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో దేనికీ అతీగతి లేదు.

నరసన్నపేట: బొంతు ఎత్తిపోతల పథకం, మడపాం ఎత్తిపోతల పథకం, వంశధార కాలువల అభివృద్ధి, ప్రతి ఇంటికి తాగునీరు, నరసన్నపేట సామాజిక ఆస్పత్రి ఆధునీకరణ, వనితమండలం వంతెన నిర్మాణం, శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు, నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధి, స్టేడియం నిర్మాణం.. ఇందులో దేనికీ మోక్షం కలగలేదు.

పలాస: పలాసలో రైతుబజారు, ఇండోర్‌ స్టేడియం, కేటీరోడ్డు నిర్మిస్తామని వదిలేశారు. కిడ్నీ సమస్యలపై పరిశోధనల సంగతి అటుంచితే ఉన్న ఆస్పత్రిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. జీడికి మద్దతు ధర ఇవ్వలేదు సరికదా ఉన్న ధరలు తగ్గిపోతున్న పరిస్థితి. పేదలకు మూడు సెంట్లు స్థలమని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు.

ఇచ్ఛాపురం: గ్రామాల్లో మూడు సెంట్లు , పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం, వంశధార జలాలు ఇచ్ఛాపురం వరకు మళ్లించే ప్రాజెక్టు, ఇంటింటికి తాగునీరు, బాహుదా, మహేంద్రతనయ నదులపై సాగునీటి ప్రాజెక్టులను ఆధునికీకరణ, గంగాసాగరం జలాశయం పనులు, ఐదు ఎత్తిపోతల పథకాలు పునరుద్ధరణ, రూర్బన్‌ నిర్మాణాలు, బెంతొరియా సమస్య.. ఇలా దేనికీ పరిష్కారం చూపలేదు. ఈఏపీ నిధులతో ప్రారంభించిన 64 రహదారులు నిర్మిస్తామన్నా చేసిందేమి లేదు. కొన్నింటికి ప్యాచ్‌ వర్క్‌లతో మమ అనిపించేశారు.

ఆమదాలవలస: నారాయణపురం ఆనకట్ట, నాగావళి– వంశధార నదుల అనుసంధానం, బలసలరేవు వంతెన నిర్మాణం, అర్హులందరికీ టిడ్కో ఇళ్లు, రైతు కూలీలకు కార్పొరేషన్‌, ఉద్యోగం చేసే మహిళలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తామన్నారు. అసలు ప్రతిపాదనలకే నోచుకోలేదు.

పాతపట్నం: పాతపట్నంలో 50 పడకల సీహెచ్‌సీ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా అమలు చేస్తామని హామీ ఇచ్చి తర్వాత మర్చిపోయారు. పాతపట్నంలో మహిళా కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు హామీలు అమలు చేయలేదు. పాతపట్నం ఎర్ర చెరువు అభివృద్ధి, బూరగాం గ్రామం వద్ద మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణం, కల్లట–జిల్లేడుపేట గ్రామాల మధ్య వంతెన, డిజిటల్‌ గ్రంథాలయాలు, ఐటీడీఎ ఏర్పాటు.. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. నిర్వాసితుల సమస్యలూ అలాగే ఉన్నాయి.

ఎచ్చెర్ల: బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌, జెట్టీ నిర్మాణం పూర్తి చేయకపోగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను నిలిపివేశారు. తోటపాలెంలో ఎత్తిపోతల పథకం, తోటపల్లి కాలువ ద్వారా శివారు

రామ్మోహన్‌నాయుడు మాటలు ఇవీ..

● సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్‌ సర్క్యూట్‌, ప్రధాన రహదారులతో పాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. నాగావళి– వంశధార, బాహుదా– మహేంద్రతనయ నదుల అనుసంధానం, మత్స్యకారుల కోసం కోస్టల్‌ కారిడార్‌, శీతల గిడ్డంగులు నిర్మాణం, జిల్లాలో ప్రత్యేక ఎంప్లామెంట్‌ జోన్‌ అంటూ ఊదరగొట్టారు. ఏవీ అమలు కాలేదు.

ప్రాంతాలకు సాగునీరు, మడ్డువలస కాలువ, నారాయణపురం కాలువ పనులు, బుడమేరు చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చడం, పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం.. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.

శ్రీకాకుళం: కోడిరామ్మూరి స్టేడియం, మత్స్యకారుల కోసం మినీ జెట్టీల నిర్మాణం, నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అన్నారు. కూల్చివేతలు, పాతపనులపై కొత్త మెరుగులు దిద్దడం తప్ప చేసిందేమి లేదు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తామన్నారు. దాని ఊసేలేదు.

డిసెంబర్‌

12న

లోక్‌ అదాలత్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డిసెంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు బుధవారం తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల న్యాయ సేవాధికార కమిటీల పరిధిలోని న్యాయస్థానాల్లో అదాలత్‌ జరుగుతుందని పేర్కొన్నారు. కక్షిదారులు కేసుల పరిష్కారానికి ముందుకురావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement