రోడ్డు ప్రమాదంలో 26 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 26 మందికి గాయాలు

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

ఎచ్చెర్ల: మండలంలోని కింతలమిల్లు జంక్షన్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. బైరీ, కరజాడ, సింగుపురం గ్రామాలకు చెందిన కూలీలను కాంట్రాక్టర్లు సాదు గణపతి, పల్లా సూరిబాబులు రోజువారీ పనికి తీసుకెళ్తుంటారు. ఇలా వెళ్లిన వీరంతా తిరిగి వస్తుండగా వ్యాన్‌ బోల్తా పడడంతో 26 మందికి గాయాలయ్యాయి. వీరంతా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొట్ట పున్నయ్యను జెమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మిగిలినవారు బలగ రామన్న, జయలక్ష్మి, లక్ష్మీనారాయణ, బి.కొండమ్మ, బి.సూరమ్మ, లీలాకుమారి, మెండ కొండమ్మ, సూర్యనారాయణ, కొత్తురు వెంకటలక్ష్మి, కె.పాపమ్మ, బి.ఆదిలక్ష్మి, విజయలక్ష్మి బెవర సోమేశ్వరరావు తదితరులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

విశ్రాంత ఆర్‌ఎంవో సేవలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ సర్వజన ఆస్పత్రి ఆర్‌ఎంవోగా పనిచేసి గతనెల 31వ తేదీన పదవీ విరమణ చేసిన డాక్టర్‌ సుభాషిని రిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆమె పదవీ విరమణ చేసినప్పటికీ రిమ్స్‌ అధికారులు, సిబ్బంది అభినందన సభ నిర్వహిస్తామని ఉండాలని కోరడంతో రిమ్స్‌లోనే ఉంటున్నారు. బుధవారం ఎచ్చెర్ల సమీపంలో జరిగిన ప్రమాదంలో 26 మందిపైగా గాయపడడంతో ఒక్కసారిగా వారిని రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న డాక్టర్‌ సుభాషిని క్యాజువాలిటీ వార్డుకు వచ్చి వైద్య సేవలను అందించారు. ఇలా పదవీ విరమణ అనంతరం సైతం సేవల అందించడంపై పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement