‘పొలాల నుంచి వర్షపు నీరు తొలగించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పొలాల నుంచి వర్షపు నీరు తొలగించాలి’

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

ఆమదాలవలస: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంట పొలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, పొలాల నుంచి వర్షపు నీటిని వెంటనే తొలగించాలని తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ నీలవేణి రైతులకు సూచించారు. సోమవారం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా మల్టీ లొకేషన్‌ ఆడియో కాన్ఫరెన్‌న్స్‌లో కృషి విజ్ఞాన కేంద్రం నుంచి 60 మంది పైగా రైతులకు పంటలపై సలహాలు అందించి వారి సందేహాలు నివృత్తి చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. నీరు తగ్గిన తర్వాత హెక్సకోనాజోల్‌ 400 మిల్లీమీటర్లు ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతుందన్నారు. మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మిల్లీలీటర్లు ప్రొపీకోనాజోల్‌ పిచికారి చేయాలన్నారు. ఆకు ముడత పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement