ముగిసిన కరాటే ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కరాటే ఎంపిక పోటీలు

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ కరాటే ఎంపిక పోటీలు ముగిశాయి. జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలోని ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వేదికగా జరిగిన ఈ ఎంపికలు ఆద్యంతం హోరాహోరిగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు/బాలబాలికలు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. అండర్‌–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపికచేశారు. డీఈఓ ఎ.రవిబాబు ఆదేశాల మేరకు ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ చల్లా జగదీష్‌ పోటీలను పర్యవేక్షించారు. ఎంపికై న బాలబాలికలను త్వరలో జరిగే రాష్ట్రపోటీలకు పంపిస్తామని జగదీష్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ మాధవరావు, కరాటే కోచ్‌ ఢిల్లేశ్వరరావు, పాఠశాల ప్రతినిధులు, ప్రిన్సిపాల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement