ఎల్.ఎన్.పేట : వైఎస్సార్ సీపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఎల్.ఎన్.పేట మండలం దబ్బపాడులో మాజీ సర్పంచ్ ముద్దాడ మోహిణి, లక్ష్మణరావు, ఎంపీటీసీ అభ్యర్థి పల్లి వరలక్ష్మీ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ పల్లి రామారావు, మెయ్యి రామారావుతో పాటు 50 కుటుంబాలు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో ఆదివారం చేరారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెనుముజ్జి విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ రెడ్డి జ్యోతి లక్ష్మీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ సాంబశివరావు, పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి రెడ్డి రామారావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ బి.భాస్కరరావు, పల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


