గొటివాడలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

గొటివాడలో టీడీపీకి షాక్‌

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

● వైఎస్సార్‌సీపీలోకి 25 కుటుంబాల చేరిక

జలుమూరు: మండలంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాల్లోనూ వైఎస్సార్‌సీపీకి జనాదరణ పెరుగుతోంది. ఇటీవలే అల్లాడలో 156 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరగా తాజాగా స్థానిక నాయకులు తంగి మురళీకృష్ణ తదితరులు ఆధ్వర్యంలో 25 కుటుంబాలు టీడీపీని వీడి ఆదివారం గొటివాడలో చేరారు. పార్టీలో చేరిన వారిలో దామ అప్పన్న, నేతింటి సింహాచలం, దళిత సంఘ నాయకులు ఎడ్ల కృష్ణారావు, కుణ, ముంజేటి ప్రేమసాగర్‌, బలగ రమణమూర్తి, ఎర్రంనాయడు, యాదవ్‌ సంఘం నాయకుడు పాలిన జగ్గారావు తదితరులు ఉన్నారు. వీరికి పోలాకి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, యువ నాయుకుడు ధర్మాన కృష్ణ చైతన్య పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని వర్గాలు కృషి చేయాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు, జెడ్పీటీసీ అభ్యర్థి బగ్గు రామకృష్ణలను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచీ విశేష ఆదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీసీ నాయకులు పోతయ్య, పల్లి రమణ, సింహాచలం, బాణ్న వెంకటేశ్‌, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement