క్వాంటమ్‌ హ్యకథాన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌ హ్యకథాన్‌ ప్రారంభం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

ఎచ్చెర్ల : ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్వాంటం టెక్నాలజీ వేడుక క్విస్కిట్‌ ఫాల్‌ ఫెస్ట్‌– 2026లో భాగంగా ట్రిపుల్‌ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో 24 గంటల క్వాంటం హ్యాక్‌థాన్‌ ఆదివారం ప్రారంభమైంది. జ్ఞాన్‌ యల్లా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విద్యా విభాగాలు, సాంకేతిక రంగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. క్వాంటం కంప్యూటింగ్‌ ఆధారంగా వాస్తవ ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు విద్యార్థులు తమ ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఆలోచనలు పంచుకుంటూ కోడింగ్‌, సమస్యలు, విశ్లేషణ పరిష్కారాల రూపకల్పనలో ఉత్సాహంగా నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ గిరిధర్‌ మద్రాస్‌, పరిపాలనాధికారి డాక్టర్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి వాసు, డీన్‌ శివరామశాస్త్రి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement