ఎచ్చెర్ల: మండలంలోని ఎస్ఎం పురం గ్రామసమీపంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీ ఆహ్వానం మేరకు గరివిడి లక్ష్మి సినిమా బృందం సభ్యులు ఆదివారం ట్రిపుల్ ఐటీ కళాశాలకు వచ్చారు. సినిమా డైరెక్టర్ జమ్ము గౌరినాయుడు, ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్, గరివిడి లక్ష్మి, రేలారేరేలారే సింగర్లు జానకీరామ్, రమణ, అప్పలనాయుడు తదితరులు వచ్చారు. వీరంతా సినీ గేయాలతో అలరించారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఏఓ డాక్టర్ శివరామకృష్ణ. ఎఫ్ఓ డాక్టర్ వాసు, డాక్టర్ మునిరామకృష్ణ, పాల్గొన్నారు.


