మెళియాపుట్టి: బాణాపురం, పెద్దగుమ్మడ, చిన్నగుమ్మడ, పదనాపురం గ్రామాలకు చెందిన 20 కుటుంబాలు శనివారం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. వారందరికీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం క్యాంపు కార్యాలయంలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పడాల నీలకంఠం, జమ్మాన లోకేష్, నిక్కల బాబూరావు, కిరణ్, కృష్ణారావు, చిన్నబాబు, అప్పారావు, చినబాబు, గొర్లె కాంతారావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయముని రావు, మాజీ సర్పంచ్ పెద్దింటి చంద్రరావు, జనపరెడ్డి కన్నబాబు, పరపటి రవికుమార్ పాల్గొన్నారు.


