స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవే..

గుండ లక్ష్మీదేవి రాకతో పార్టీ మరింత బలోపేతం

శ్రీకాకుళం మేయర్‌ గెలుపు నల్లేరుపై నడకే

పార్టీ కార్యాలయ స్వాగత కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు మోసం, దగాయే తప్ప మేలేమీ చేయలేదని వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, పెద్ద కుమారుడు గుండ శివ గంగాధర్‌ శనివారం జిల్లా పార్టీ కార్యాలయానికి ముహూర్తం ప్రకారం విచ్చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు అధ్యక్షతన జరిగిన స్వాగ త సమావేశంతో ధర్మానతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గుండ లక్ష్మీదేవి పార్టీలో చేరిన రోజే వైఎ స్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం మేయర్‌ అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ఆమె విజయాని కి 60 డివిజన్ల ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేమని టీడీపీ చేతులెత్తేసిందని గుర్తు చేశారు. నేడు మనం పోటీ చేయడమే కాకుండా విజయాన్ని సాధించే స్థాయిలో ప్రజల మద్దతును పొందుతున్నామని చెప్పారు. మరోవైపు అధికార పార్టీ అక్రమాలకు అంతులేకుండా పోతోందన్నారు. పొందూరు మండలంలో ఐదు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించిన పరిస్థితి ఏర్పడటం దారుణమన్నారు. ప్రజల్లో విశేష ఆదర ణ, జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న గుండ కుటుంబం వైఎస్సార్‌ సీపీకిలోకి రావడం మన పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమె మేయర్‌గా గెలవడం నల్లేరుపై నడకేనన్నారు.

అవమానాలు భరించలేకే..

40 ఏళ్ల చరిత్ర కలిగిన తమ కుటుంబానికి టీడీపీలో తీవ్ర అవమానాలకు గురిచేశారని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. టికెట్‌ ఇవ్వకుండా అడుగడుగునా తీవ్ర పరాభవాలు ఎదుర్కొనేలా చేశారన్నారు. వైఎస్సార్‌సీపీలో ఆదరణ బాగుందని, పార్టీ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్‌, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, 60 డివిజన్ల ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement