ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ బీఈడీ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 4, 5వ తేదీల్లో జరగాల్సిన మూడో సెమిస్టర్ పరీక్షలను స్థానిక ఎన్నికల కారణంగా ఈ నెల 10, 11వ తేదీలకు వాయి దా వేస్తున్నట్లు ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ యూ. కావ్యజ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో రెండు, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కేంద్రాల్లో జరగాల్సిన ఈ పరీక్షలు అవే కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కణితి తేజేశ్వరరావు మృతిచెందారు. కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈయన శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తేజేశ్వరరావు అకాల మృతి పట్ల డీఈఓ ఎ.రవిబాబు, హెచ్ఎం, డిప్యూటీ ఈఓ ఆర్.విజయకుమారి, గెడ్డాపు రాజేంద్రప్రసాద్, వైఎస్సార్‌టీఏ జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎం.మనోహను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇంతకు ముందు ఇన్చార్జిగా వ్యవహరించిన విజయనగరం అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు ఆ జిల్లాకే పరిమితం కానున్నారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రాబంధుల మాదిరిగా చంద్రబాబు పాలన సాగుతోందని మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో గెలిచే దమ్ములేక నామినేషన్‌కు వెళ్లకుండా పత్రాలు చించేసి దారుణంగా వెన్నుపోటు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నాని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల ని కోరారు. ఈ ఎన్నిక రెండు పార్టీలకు కాదని మంచికి.. మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు. ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని మంచి చేసే జగన్మోహన్రెడ్డి పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని కోరారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల ను టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఆదుకోలేదన్నా రు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.700కోట్లుతో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు తీసుకొచ్చి శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను దగా చేశారని మండిపడ్డారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం, పలాస – కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులకు కేటాయించిన ప్రతీ అధికారి, సిబ్బంది అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్దతతో నిష్పక్షపాతంగా నిర్వర్తించాలన్నారు.
ప్రత్యేక దృష్టి సారించి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు.


