సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
మద్యం సిండికేట్‌తో రూ.కోట్లు సంపాదించారు. భూ కబ్జాలతో జేబులు నింపుకున్నారు. ఇప్పుడు గద్దెనెక్కడానికి అదే డబ్బును వెదజల్లుతున్నారు. పలాసలో సాగుతున్న రాజకీయమిది. ఏకంగా ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు టీడీపీ నాయకులు సిద్ధ పడుతున్నారంటే.. ఎంతగా దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు.
దందాకు పలాసే రోల్ మోడల్
జిల్లాలో మొట్టమొదట మద్యం సిండికేట్ అయ్యింది పలాస–కాశీబుగ్గలోనే. ఎంఆర్పీకి మించి విక్రయాలు ప్రారంభించింది ఇక్కడే. బెల్ట్‌షాపులకు దారి చూపింది.. డోర్ డోలివరీ చేసినట్టు మందును బెల్ట్‌షాపులకు అందజేతకు శ్రీకారం చుట్టింది కూడా ఇక్కడే. పలాసలో జరిగిన లిక్కర్ దందాను రోల్ మోడల్‌గా తీసుకుని జిల్లా వ్యాప్తంగా బెల్ట్‌షాపులు, ఎంఆర్పీకి మించి విక్రయాలు, కల్తీ మద్యం దోపిడీని కొనసాగించారు. అత్యధిక షాపులు దక్కించుకున్న ‘బాబు’ గుత్తాధిపత్యం వహిస్తూ, సిండికేట్‌కు నాయకత్వం వహించారు. గుడి, బడి లేకుండా షాపులు, బెల్ట్‌షాపులు పెట్టి, ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టి రూ. కోట్లు సంపాదించారు. ఇప్పుడా సొమ్మును ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఒక్క మద్యం సిండికేట్తోనే కాదు కబ్జా భూములతో సంపాదించిన సొమ్మును కూడా బయటకి తీశారు.
ప్రచారంలో ప్రజాదరణ కనిపించకపోవడం, ఓటమి భయం పట్టుకోవడం, సొంత పార్టీ సభ్యులే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్రంగా బరిలోకి దిగడంతో సిండికేట్ ‘బాబు’ ఎంత ఖర్చు పెట్టడానికై నా వెనుకాడడం లేదు. ఎక్కడైనా అవసరమైతే బల్క్‌లో సొమ్ము ఇవ్వడానికి కూడా వెనుకంజ వేయడం లేదు.


