బైండోవర్‌ నెపంతో నిర్బంధించడం తగదు | - | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ నెపంతో నిర్బంధించడం తగదు

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

సంతబొమ్మాళి: బైండోవర్‌ కేసుల నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించటం తగదని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంతబొమ్మాళి–2 వైఎస్సార్‌సీసీ ఎంపీటీసీ అభ్యర్థి నిర్మల భర్త రాజు, మాజీ ఎంపీటీసీ కొన్న శ్రీరాములు, చిన్నతుంగాం ఎంపీటీసీ అభ్యర్థి కాని జగ్గారావులను బైండోవర్‌ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంచడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. ఎన్నికల సమయం కావడంతో ప్రచారానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుయుక్తులను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఓటర్లు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement