రణస్థలం: కూటమి పాలనలో ప్రజలకు చేసేందేమీ లేదని, అందుకే అంతా వైఎస్సార్‌సీపీ బాట పడుతున్నారని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలం మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎచ్చెర్ల మండలం బడివానిపేట, భగీరథపురం పంచాయతీలోని మూసవానిపేట, వీరయ్యవలస గ్రామాల నుంచి 70 టీడీపీ కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. దోని హరికృష్ణ, బడి తోటయ్య, ఆకల్ల చంద్రమోహన్, సూరాడ లక్ష్మయ్య, బడి నర్సింహులు, మోస అప్పారావు, సూరాడ లక్ష్మయ్య, దోని అప్పన్న, నగేష్, బడి సత్యంతో పాటు పలువురికి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ ఐక్యతతో పని చేయాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలో వ్యతిరేకత బలంగా ఉందని, ప్రజలకు వ్యతిరేకత స్పష్టంగా తెలియజెప్పాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, ఎంపీపీ అభ్యర్థి నేతింటి నీలమప్పడు, మండల పార్టీ అధ్యక్షుడు బోర సాయిరాం రెడ్డి, నాయకులు మూగి శ్రీరాములు, గోవిందరెడ్డి, నక్క కృష్ణమూర్తి, కారి తాతారావు, మారుపల్లి కనకరాజు, కునుకు కన్నప్పడు, గంగు ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


