డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

ఎచ్చెర్ల : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 2011–15 మధ్య ఇయర్‌ అండ్‌ (వార్షిక పరీక్షల) విధానం, 2015–19 మధ్య సెమిస్టర్‌ విధానం బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ తదితర డిగ్రీ కోర్సులు చదివి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ఈ నెల 27 నుంచి నవంబర్‌ 6 వరకూ జరగాల్సిన ప్రథమ, ఆరో సెమిస్టర్‌, సంవత్సర కాలవ్యవధిలో మూడో ఏడాది పరీక్షలు మాత్రమే వాయిదా వేశామని ఎగ్జామినేషన్‌ డీన్‌ ఎం.అనూరాధ తెలిపారు. వీటిని డిసెంబర్‌ 15 నుంచి 23 వరకూ నిర్వహిస్తామని, మిగిలిన పరీక్షలు యథాతథంగా జరగుతాయన్నారు.

‘జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్‌ రిపోర్టర్‌ సుబ్బారెడ్డిపై దాడి అమానుషమని, విధుల్లో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఏఓ సూర్యనారాయణకు జిల్లాలోని జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీకాకుళం సాక్షి ఆర్‌సీ ఇన్‌చార్జి వీవీఎన్‌ శ్రీనివాస్‌, రిపోర్టర్లు బగాది అప్పలనాయుడు, ఆర్‌వీ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. అలాగే ఎచ్చెర్లలో డెస్క్‌ జర్నలిస్టులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు కట్టుకుని విధులు నిర్వహించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement