ఆమదాలవలస : బూర్జ మండలం చీడివలస పంచాయతీ గంగంపేట గ్రామానికి చెందిన 15 టీడీపీ కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో జాగుపల్లి వెంకటేష్, పైల మోహన్‌రావు, గొల్లి గోవిందరావు, పోలసరి రాంబాబు, పైల నాగరాజు, బొడ్డ గోవింద, నినగుప్పల పోతయ్య, చొక్కర రాము తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు బొడ్డేపల్లి నారాయణరావు, సాకేటి శ్రీను, బొల్లు సాంబమూర్తి, బొల్లు సూరిబాబు, జాగుపల్లి దళినాయుడు, పందిరి వెంకట్రావు, చంద్రపురి నీలం, జాగుపల్లి మధుసూదనరావు, సంభాన వీరాస్వామి, కొబగాన రామకృష్ణ, మామిడి గౌరీనాయుడు, బొత్స లక్ష్మణరావు, చొక్కార జనార్దనరావు, పొలసరి త్రినాథ్, పాలవలస దుర్గారావు, మామిడి వెంకటరమణ, బూరి గణేష్, గడిదేసి అప్పలనాయుడు, జగ్గుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.


