పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన తలా బర్లాండ, ఉప్పర బర్లాండ, పరిసరాల్లో 370 లీటర్ల నాటుసారా, 3,300 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేసి భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ దాడుల్లో జిల్లా ఎకై ్సజ్, గజపతి జిల్లా ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


