కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు శుక్రవారం టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. సిరుసువాడకు చెందిన పార్టీ నేత బండారి నారాయణ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కోటిలింగాల మిననారు, జి.రంగారావు, ఏ.జయకృష్ణ తదితర 60 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బందారి నారాయణ అర్జున పాత్రో, కోటిలింగాల దీనబందు, పాత్రో భాస్కరరావు, సుభాష్, బెహర దాలయ్య, కొవ్వాడ లోకేష్, చెంగల వినోద్ తదితరులు పాల్గొన్నారు.


