రైళ్ల రాకపోకలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రైళ్ల రాకపోకలు బంద్‌

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

● పొంగి ప్రవహించిన బాహుదా నది

● ప్రమాదకర స్థాయికి చేరడంతో పలు రైళ్లు రద్దు

● మరికొన్ని రైళ్ల రాకపోకలు మళ్లింపు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సంతో పొంగి ప్రవహించిన వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో శ్రీకాకుళం జిల్లా మీదగా వెళ్లే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం–జాడిపూడి సెక్షన్ల మధ్య బ్రిడ్జి నంబర్‌ 1052 వద్ద బాహుదా నదిలో వరద నీరు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం, శుక్రవారం, శనివారం బయల్దేరాల్సిన పలు రైళ్లు రద్దు చేయగా, కొన్ని మార్గాల మళ్లింపు, మరికొన్ని సమయం మార్పులు చేశారు.

రద్దయిన రైళ్లు

28న బయలుదేరిన రూర్కెలా–గుణుపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 29న గుణుపూర్‌– రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ను మధ్యలో నిలిపివేయగా, గురువారం(29) బయలుదేరాల్సిన విశాఖపట్నం– దిషూ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌– హౌరా ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌– భువనేశ్వర్‌ న్యూ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, జునాఘట్‌– భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, గుణపూర్‌– పూరి ఎక్స్‌ప్రెస్‌, కటక్‌– పలాస ప్యాసింజర్‌, విశాఖపట్నం– బ్రహ్మపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం– భువనేశ్వర్‌ న్యూ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం – భువనేశ్వర్‌ వందేభారత్‌, భువనేశ్వర్‌– జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌– విశాఖపట్నం వందేభారత్‌, హౌరా– ఎంజీఆర్‌ చైన్నె కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌–బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా– చర్లపలి ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌, సత్రాగచి– యలహంక ఎక్స్‌ప్రెస్‌, 30న బయలుదేరాల్సిన బ్రహ్మపూర్‌– విశాఖపట్నం ప్యాసింజర్‌, పలాస– కటక్‌ ప్యాసింజర్‌, గుణుపూర్‌– కటక్‌ ప్యాసింజర్‌, భువనేశ్వర్‌– జగ్దల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 31న బయలుదేరాల్సిన చర్లపల్లి– షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

మళ్లించిన రైళ్లు

27న బయలుదేరిన అగర్తలా–ఎస్‌ఎంవీ బెంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 28న బయలుదేరిన షాలిమార్‌–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా–ఎంజీఆర్‌ చైన్నె మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌– నాగర్‌కోయిల్‌ జంక్షన్‌ ఎక్స్‌ప్రెస్‌, మాల్దాటౌన్‌– ఎస్‌ఎంవీ బెంగుళూరు స్పెషల్‌, బాగల్‌పూర్‌– ఎస్‌ఎంవీ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌, హౌరా– ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌– చర్లపల్లి ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎంజీఆర్‌ చైన్నె – హౌరా మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా– యశ్వంత్‌ పూర్‌, షాలిమార్‌– చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌– సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, చైన్నె సెంట్రల్‌– హౌరా, పుదుచ్చేరి– షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌, చర్లపల్లి– కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌, చైన్నె సెంట్రల్‌– న్యూ జల్పాయిగురి ఎక్స్‌ప్రెస్‌, తిరుచరాపల్లి–న్యూ జగల్పాయిగురి ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌ఎంవీ బెంగుళూర– హౌరా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌– ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి– దిబ్రూగడ్‌ ఎక్స్‌ప్రెస్‌, చర్లపల్లి– షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌, పుదుచ్చేరి–భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 29న బయలుదేరాల్సిన తిరుపతి– పూరి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌– భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌ఎంవీ బెంగుళూరు– హౌరా ఎక్స్‌ప్రెస్‌, పూరి – అహ్మదాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగుళూరు– భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, భువేశ్వర్‌– ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌, బ్రహ్మపూర్‌– ఉద్దన అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వేరే మార్గాల గుండా మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement