ఎంపీటీసీల ఫోర్జరీ డ్రామాపై న్యాయపోరాటం | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీల ఫోర్జరీ డ్రామాపై న్యాయపోరాటం

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పొందూరు మండలంలో ఐదుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను వారి సమ్మతి లేకుండానే ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించినట్లు ఆర్‌ఓ ప్రకటించడం దారుణమని వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌ చైర్మన్‌ శిమ్మ రాజశేఖర్‌ అన్నారు. ఐదు ఎంపీటీసీ స్థానాలను కూటమి పాలకులు ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం చేసుకున్న వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో కుమ్మకై ్కన జిల్లా పౌరసరఫరాల అధికారి, పొందూరు మండల రిటర్నింగ్‌ అధికారి గుంట సూర్యప్రకాశరావు వ్యవహార శైలిపై పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. తమ సంతకాలు కావని సంబంధిత అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పేర్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే డిజిటల్‌ బుక్‌లో నమోదు చేసిందన్నారు. రానున్న రోజుల్లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టేందుకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల హక్కులను కాలరాస్తూ, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరించినట్లు వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెలికితీసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, అభ్యర్థుల సమ్మతి లేకుండా వారి నామినేషన్లను ఉపసంహరించినట్లు తేలితే బాధ్యులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement