ఎట్టకేలకు..! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..!

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

● చిల్డ్రన్స్‌ హోమ్‌కు చల్లవానిపేట అనాథ పిల్లలు ● గతేడాది సాక్షిలో ‘ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు’ శీర్షికతో కథనం ● ఫలించిన సీడీపీవో వంశీ ప్రియ కృషి

● చిల్డ్రన్స్‌ హోమ్‌కు చల్లవానిపేట అనాథ పిల్లలు ● గతేడాది సాక్షిలో ‘ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు’ శీర్షికతో కథనం ● ఫలించిన సీడీపీవో వంశీ ప్రియ కృషి

జలుమూరు: చల్లవానిపేటలో అనాథగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న మతిస్థిమితం లేని తల్లి లక్ష్మితోపాటు పిల్లలు పద్మ, బోడెమ్మ, కరువమ్మను సీ్త్ర సంక్షేమ అధికారి సీహెచ్‌ వంశీప్రియతో పాటు స్థానిక అధికారులు ఆదుకున్నారు. అనాథ పిల్లలను అరసవల్లి చిల్డ్రన్‌ హోంకు, తల్లిని రిమ్స్‌కు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి తరలించారు. ఈ అనాథ పిల్లలు, మతిస్థిమితం లేని తల్లి జీవనంపై గతేడాది అక్టోబర్‌ 24న సాక్షి దినపత్రికలో ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్‌ స్వప్నికల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పందించి సీ్త్ర, శిశు సంక్షేమాధికారులకు వారిని సురక్షిత చోటుకు తరలించి, తల్లికి వైద్యం.. పిల్లలకు విద్య, వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచి రెవెన్యూ, మెడికల్‌, పోలీసు, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి తల్లి లక్ష్మి పిల్లలను తీసుకొని వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో అధికారులు అప్పట్లో కొంత జాప్యం చేశారు. దీంతో మళ్లీ సీడీపీవో దృష్టికి స్థానిక సాక్షి విలేకరి తీసుకెళ్లగా న్యాయస్థానం అనుమతి కావాలని జిల్లా అధికారులు స్పష్టం చేయడంతో కొద్ది రోజులు జాప్యం జరిగింది. అనంతరం న్యాయస్థానం నుంచి పూర్తిస్థాయి అనుమతితో వర్షంలో కూడా అధికారులు రెస్క్యూ అపరేషన్‌ చేసి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ బోర్డు ముందు మంగళవారం ప్రవేశపెట్టారు. తల్లిని స్వధార మహిళ వసతి గృహంనకు తరలించి అవసరమైన చికిత్స రిమ్స్‌లో ఇచ్చే ఏర్పాట్ల చేశారు. సాక్షి కథనంతో అనాథ పిల్లలు, తల్లికి పూర్తిస్థాయి మేలు జరిగిందని సారవకోట సీడీపీవో సీహెచ్‌ వంశీ ప్రియ అన్నారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి రమణ, మిషన్‌ కో–ఆర్డినేటర్‌ ఉమ, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement