విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ తనిఖీలు

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

శ్రీకాకుళం క్రైమ్‌: నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కిరాణా షాపుల్లో అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర విజిలెన్సు డైరెక్టర్‌ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశాలివ్వడంతో జిల్లాకేంద్రంలో విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లీగల్‌ మెట్రోలజీ అధికారులు మంగళవారం సంయుక్త దాడులు నిర్వహించారు. గుజరాతీపేటలోని పలు కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్లలో జరిగిన ఈ దాడులు సంబంధిత జిల్లా అధికారి, ఏఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొన్ని షాపులపై లీగల్‌ మెట్రోలజీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వివేకానంద మాట్లాడుతూ అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ రామారావు, లీగల్‌ మెట్రోలజీ అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అలైడ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ పరిధిలోని 9 రకాల డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న 78 సీట్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.అప్పలనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య రంగానికి అనుబంధంగా ఉండే ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు అక్టోబరు 27 నుంచి నవంబర్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కోర్సుల పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, అవసరమైన అర్హతల సమాచారాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. జిల్లా లోని అర్హులైన అభ్యర్థులు గడువులోగా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సందేహాలు ఉంటే కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

శ్రీకాకుళం రూరల్‌: ఏపీ స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ తరుపున డిప్లొమా అలైడ్‌ హెల్త్‌కేర్‌ కోర్సుల్లో రెండో దశ కౌన్సిలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ సెంటర్‌ హెడ్‌ డైరక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులు నవంబర్‌ 5లోపు చేరవచ్చునన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. తమ కళాశాలలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement