పొందూరులో ప్రజాస్వామ్యం ఖూనీ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి 5 నామినేషన్లు విత్‌డ్రా వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై దొంగదెబ్బ నిలదీసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు ఏం చేయలేనంటూ తెల్లమొహం వేసిన రిటర్నింగ్ అధికారి
ఆర్వో అమ్ముడుపోయారు..
సీఐ అతి.. మీడియాపై దురుసు పవర్తన..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. ప్రజా స్వా మ్యానికి ఊపిరిగా నిలిచే ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన వ్యక్తి. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అధికారి. కానీ కూటమి పాలనలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నవ్వులపాలైంది. ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక.. అడ్డదారిలో వారి నామినేషన్లను విత్‌డ్రా చేశారు. అభ్యర్థులు కార్యాలయానికి వెళ్లకుండా, అసలు సంతకం కూడా చేయకుండా నకిలీ సంతకాలతో వారి నామినేషన్లు విత్‌డ్రా చేశారని అభ్యర్థు లు ఘొల్లుమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇంతకంటే అవమానం ఏముంటుంది. పొందూరులో జరిగిన ఈ ఘటన సిక్కోలు రాజకీయ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోనుంది. పొందూరు మండలంలోని పొందూరు 3, రాపాక 1, కోటిపల్లి, బాణాం, నందివాడ ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమైనట్లు మంగళవా రం రాత్రి 8 గంటలకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అవాక్కయ్యారు. నామినేషన్లు వేసి బీ ఫారాలు కూడా అందుకుని ప్రచారంలో ఉన్న అభ్యర్థులు ఈ ప్రకటన తో నిశ్చేష్టులయ్యారు. వెంటనే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నిలదీస్తే అధికారి నీళ్లు నమలడం తప్ప సమాధానం చెప్పలేకపోయారు. రిటర్నింగ్ అధికా రి తీరు చూసి మండలంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. తాము విత్‌డ్రా చేసుకోలేదని సాక్షాత్తు అభ్యర్థులే చెబుతుంటే.. ఎవరో ఒక వ్యక్తి వచ్చి, విత్ డ్రా చేసుకుని వెళ్లిపోయారని సమాధానం ఇచ్చారు. ఆ అదృశ్య వ్యక్తి ఎవరో సీసీ కెమెరా పుటేజీలోనైనా చూపించాలని కోరితే.. అసలు సీసీ పుటేజీలే లేవని, తానేమీ చేయలేనని నిస్సహాయంగా సమాధానమిచ్చారు. ఈ వికృత వైఖరిపై వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
●ఫోర్జరీ సంతకాలతో జరిగిన ఐదు ఏకగ్రీవాల ప్రకటనను తక్షణమే రద్దు చేసి, అభ్యర్థులను తిరిగి పోటీలో ఉంచాలి.
●విత్‌డ్రా పత్రాలు సమర్పించిన సమయంలో కార్యాలయంలో ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలించి, నకిలీ పత్రాలు తెచ్చిన సూత్రధారులపై క్రి మినల్ చర్యలు తీసుకోవాలి.
●అభ్యర్థులు రాకుండా విత్‌డ్రా ఫారాలను అంగీకరించిన ఎన్నికల అధికారిపై విచారణ జరపాలి.
ఐదుగురు మహిళా ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్వో దగ్గరికి గానీ.. కార్యాలయం కానీ రాకుండా వారి నామినేషన్లు ఎలా ఉపసంహర ణ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌కి ఆర్వో అమ్ముడుపోయారు. న్యాయ పోరాటం చేస్తాం.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ
ఆమదాలవలస సమన్వయకర్త
ఫోర్జరీ ఏకగ్రీవం విషయం మండలమంతా వ్యాపించడంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను రప్పించి, ప్రశ్నించే వారి పై ఉక్కుపాదం మోపారు. ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు నాయకులు, కార్యకర్తలపైనే కాకుండా మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. మీడియా సమక్షంలో ఉపసంహరణ, ఏకగ్రీవం గుట్టు తేల్చా లని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడిగితే మీడియా బయటకు వెళ్లిపోవాలని రెక్కలు పట్టు కుని బయటికి లాగేశారు. ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కరెంటు తీసేశారు.


