కూటమి ఏకగ్రీవం ప్రయత్నాలకు వైఎస్సార్‌సీపీ చెక్ అన్ని స్థానాల్లో బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీల బరిలో మొత్తం 95 మంది అభ్యర్థులు
అరసవల్లి: జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరింది. మొత్తం 30 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల (జెడ్పీటీసీలు) స్థానాలకు మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల్లో బరిలో నిలవనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను ఎన్నికల సహాయ అధికారి, జెడ్పీ సీఈ ఓ ఆర్.వెంకట్రామన్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. జిల్లాపరిషత్‌లో నామినేషన్ల ఉపసంహరణ, తుదిజాబితా ప్రకటన అలాగే నమూనాల తయారీ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల పరిశీలకుడు, మల్లావరపు సూర్యతేజ మంగళవారం జెడ్పీ సీఈఓతో చర్చించారు. జిల్లాలో 30 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలో ఉండడంతో ఏకగ్రీవానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఏకగ్రీవం కోసం పలు చోట్ల కూటమి ప్రభుత్వ పెద్ద లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అయితే కూటమి మిత్ర బంధం కారణంగా 30 జెడ్పీటీసీల్లో 22 చోట్ల టీడీపీ, బీజేపీకి 2, జనసేనకు 6 సీట్లు కేటాయించారు. ఇక వైఎస్సార్‌సీపీ అభ్యర్థు లు బరిలో ఉండడానికి ఫిక్స్ కావడంతో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, సీపీఐ (ఎం)04,సీపీఐ 01తో పాటు 15మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.
ఎంపీటీసీలు
మొత్తం 542 ఎంపీటీసీ స్థానాలకు గాను 19 చోట్ల ఏకగ్రీవం కాగా.. మిగిలిన 523 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు మొత్తం 1222 మంది పోటీలో నిలిచారు. ఇందులో అత్యధికంగా వైఎస్సా ర్ సీపీ అభ్యర్థులు 523 మంది, టీడీపీ 478, జనసే న 74, బీజేపీ 24, కాంగ్రెస్ 12, బీఎస్పీ 2, సీపీఐ(ఎం) 7, ఇతరులు 3, ఇండిపెండెట్లు 99 మంది పోటీలో ఉన్నారు.
పార్టీలు బరిలో ఉన్న స్థానాలు
వైఎస్సార్‌సీపీ అన్ని జెడ్పీటీసీ స్థానాలు
బీజేపీ జి.సిగడాం, హిరమండలం
జనసేన ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, ఎల్‌ఎన్ పేట, మందస, నరసన్నపేట, సరుబుజ్జిలి
టీడీపీ ఆమదాలవలస, బూర్జ, గార, జలుమూరు, కంచిలి, కవిటి, కోటబొమ్మాళి,
కొత్తూరు, లావేరు, మెళియాపుట్టి, నందిగాం, పలాస, పాతపట్నం, పోలాకి,
పొందూరు, రణస్థలం, సంతబొమ్మాళి, సారవకోట, సోంపేట, శ్రీకాకుళం,
టెక్కలి, వజ్రపుకొత్తూరు.
కాంగ్రెస్ ఆమదాలవలస, ఎచ్చెర్ల, జి.సిగడాం, గార, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి,
కవిటి, లావేరు, నందిగాం, నరసన్నపేట, పొందూరు, రణస్థలం, సరుబుజ్జిలి, సోంపేట.
సీపీఐ(ఎం) ఎచ్చెర్ల, మందస, పలాస, టెక్కలి
సీపీఐ పలాస
ఇండిపెండెంట్లు టెక్కలి (ముగ్గురు అభ్యర్ధులు), ఎచ్చెర్ల (ఇద్దరు), ఆమదాలవలస, బూర్జ, గార,
కోటబొమ్మాళి, నందిగాం, నరసన్నపేట, పోలాకి, రణస్థలం, సంతబొమ్మాళి, సారవకోట


