శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 జోరువానలో.. కదిలివచ్చిన సిరులతల్లి

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
జోరువానలో.. కదిలివచ్చిన సిరులతల్లి

విజయనగరం:

మంగళ వాయిద్యాలు.. భక్తుల భజనలు... జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ జయజయ ధ్వానాల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి సిరిమాను సంబరం మంగళవారం ప్రశాంతంగా సాగింది. సిరిమాను పూజారి రూపంలో దర్శనమిచ్చిన సిరులతల్లికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉదయం నుంచి కురిసిన జోరువానలోనే సిరిమాను తిరువీధి సాగింది. జిల్లా యంత్రాంగం ముందుస్తుగా నిర్ణయించిన సమ యం ప్రకారం పూజారి బంటుపల్లి వెంకటరావు మధ్యాహ్నం 2.38 గంటలకు సిరిమానును అధిరోహించగా.. 2.55 గంటలకు సిరిమాను రథం కదిలింది. పాలధార ముందు కదలగా తెల్ల ఏనుగు, బెస్తవారి వల, అంజలి రథం సిరిమాను వెంట సాగాయి. అమ్మవారి చుదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమాను తిరువీధి డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేసింది. అనంతరం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement