నరసన్నపేట: అర్నబ్ తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని పా ర్టీ శ్రేణులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేశారు. అవసరమైన చోట తక్షణ సహాయం చేపట్టాలని పిలుపు నిచ్చారు. తీర ప్రాంతాల గ్రామాలు, నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వరద ప్రవాహాలు, ఈదురుగాలులపై అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే అధికారులు స్పందించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆహారం, నీరు అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.
టెక్కలి: టెక్కలి–5 ప్రాదేశికంలో వైఎస్సార్ సీపీ తరఫున తన భార్య మా ణిక్యం నామినేషన్ వేసిందని, కానీ నామినేషన్ నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించారని మాణిక్యం భర్త అనంతో తెలిపారు. తనను టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయించారని, టెక్కలి సీఐ మరీ ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. అయినా నా మినేషన్ ఉపసంహరించుకోలేదని తెలిపారు.
నరసన్నపేట: మడపాం జనసేన అభ్యర్థి రాపర్తి జానకితో టీడీపీ నాయకులు సుందరరావు, వెంకటరావులు తదితరులు మంగళవారం వా గ్వాదానికి దిగారు. ‘కూటమి పొత్తులో భాగంగా నరసన్నపేట జెడ్పీటీసీ సీటును జనసేనకు ఇచ్చాం.. మీరు మడపాంలో ఎలా పోటీ చేస్తారు.. వెంటనే విరమించుకోవాలి’ అని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సుందరరావు, నరసన్నపేటకు చెందిన వెంకటరావు తదితరులు ఒత్తిడి చేశారు. దీంతో అటు జనసే న ఇటు టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘మా పార్టీ మాకు బీ– ఫారం ఇచ్చింది మేము పోటీ చేస్తాం..మా సత్తా చూపిస్తాం.’ అని జానకి అన్నారు.


