●విద్యాసంస్థలకు నేడు సెలవు | - | Sakshi
Sakshi News home page

●విద్యాసంస్థలకు నేడు సెలవు

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

●విద్యాసంస్థలకు నేడు సెలవు ●తెగిన విద్యుత్‌ వైర్లు ●తీరంలో గుర్తు తెలియని ఓడ

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్‌’ తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు అంగన్‌వాడి కేంద్రాలతో సహా బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ సహా అన్ని యాజమాన్యా ల పరిధిలోని పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

నరసన్నపేట: ఈదురు గాలులకు మేజరు పంచాయతీ పరిధిలోని దేశవానిపేటలో విద్యుత్‌ వైర్లు తెగి పడ్డాయి. నాలుగో సచివాలయం వద్ద ఒక చెట్టు విరగడంతో వైర్లు తెగాయి. వెంటనే అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ అధికారులు, ఈఓపీఆర్డీ జగన్‌మోహనరావు పరిశీలించి సరి చేశారు. డోలపేట వద్ద విద్యుత్‌ వైర్లపై చెట్టు కొమ్మలు పడటడంతో విద్యుత్‌ సరఫరాకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు స్పందించి చెట్టు కొమ్మలను తొలగించారు.

వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేట తీరానికి గుర్తు తెలియని ఓడ వచ్చి సంద్రంలో చిక్కుకుంది. సాధారణంగా భారీ ఓడలు తీరానికి దగ్గరగా వచ్చే పరిస్థితి ఉండదు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో ఆ గాలులకు తట్టుకోలేక తీరానికి అతి సమీపంలోకి వచ్చినట్లు మంచినీళ్లపేట మత్స్యకారులు చెబుతున్నారు. ఉదయం నుంచీ ఓడ ఒకే చోట కదలకుండా ఉందని వారు చెబుతున్నారు. మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement