చిత్రంలో ఆవేదన పంచుకుంటున్న దివ్యాంగుడి పేరు గాలి కేశవరావు. ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురం గ్రామంలో సోమ వారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో ఆయన తన బాధ ను పంచుకున్నారు. 2024లో టీడీపీ నిర్వహించిన ర్యాలీకి వెళ్లానని, ఆ సందర్భంలో జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పో యానని ఆయన తెలిపారు. పూర్తి వైకల్యంతో బాధపడుతున్నా.. ఇప్పటికీ తనకు దివ్యాంగ పింఛన్ ఇవ్వలేదని, టీడీపీ నాయకులు సైతం పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. తనను ఆదుకోవాలని కోరారు. – ఇచ్ఛాపురం


