● నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి | - | Sakshi
Sakshi News home page

● నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

అరసవల్లి: స్థానిక ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగియనుంది. జిల్లాలో మొత్తం 30 జెడ్పీటీసీల స్థానాలకు స్క్రూట్నీ అనంతరం మొత్తం 210 నామినేషన్లు వాలిడ్‌గా గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 నుంచి అవకాశం ఇవ్వడంతో ఆది, సోమవారాల్లో మొత్తం 22 నామినేషన్లు విత్‌డ్రా అయినట్లుగా జిల్లా పరిషత్‌ సీఈఓ, రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వెంకట్రామన్‌ ప్రకటించారు. కాగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల ఉపసంహరణకు గడు వు ఉంది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, రెబల్స్‌ పోటు తప్పించుకునేందుకు ఆయా నామినేషన్లను విత్‌డ్రా చేసుకునేలా అభ్యర్థులను విజ్ఞప్తి చేస్తున్నారు. పలుచోట్ల బెదిరింపులు, బుజ్జగింపులు, ప్రలోభాల పర్వాలు కొనసాగుతున్నాయి. ఇక గత రెండు రోజులుగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ 15, టీడీపీ 07 మంది తమ డమ్మీ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోపు మరి న్ని నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నందున జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాలో మొత్తం 30 మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు కూడా జరుగుతోంది. వాటికి కూడా మంగళవారమే గడువుగా షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement