ఎచ్చెర్ల : యువ పరిశోధకులు శాసీ్త్రయ దృక్పథం అలవరుచుకోవాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ అన్నారు. ఇన్ఫోనేటివ్ ఫ్రంటియర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎప్‌ఎస్‌టీ)–2026 పేరిట రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు సోమవారం వర్సిటీలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. బయో, నానో, క్వాంటమ్ టెక్నాలజీ, పరిశోధనలు, ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బయోమెడికల్ రంగంలో జరుగుతున్న పరిశోధనలను కెనడాలోని మనితోబా యూనివర్సిటీ ప్రొఫెసర్ సయ్యద్ ఘవామీ వివరించారు. కెనడా మనితోబా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ప్రసేన్ చెలికాని, అపోలో చీఫ్ సౌంటిఫిక్ అధికారి ఎం.వి.శశిధర్, ప్రొఫెసర్ పీఎస్‌పీ ధనుంజయ్, అనీపె శిరీషలు ప్రసంగించారు. అనంతరం అపోలో గ్రూపుతో డాక్టర్ బీఆర్‌ఏయూ ఎంఓయూ కుదుర్చుంది. ప్రసేన్ చెలికానిని విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమిస్తూ ప్రొసీడింగ్ విడుదల చేసింది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, మాజీ వీసీ భగవత్‌కుమార్, డాక్టర్ ఉదయభాస్కర్, కావ్యజ్యోత్స్న, వివిధ శాఖల అధిపతులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


