లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

కవిటి: జాతీయ రహదారిపై శిలగాం ఫ్‌లై ఓవర్‌ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం బసవపుట్టుగకు చెందిన దుక్క రామారావు(38) సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కవిటి మండలం కరాపాడులోని తన అత్తవారింటికి బయలుదేరాడు. శిలగాం జంక్షన్‌ సమీపంలోని ఫ్‌లై ఓవర్‌ చివరకు వచ్చేసరికి పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. రామారావు వెనుకచక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement