అన్నదాతల్లో అలజడి | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో అలజడి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

నష్టం తప్పదు.. కోతలు వాయిదా మేలు..

హిరమండలం: అర్నబ్‌ తుఫాన్‌ హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట కొన్ని ప్రాంతాల్లో పొట్టదశ, వెన్నుదశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పంటలు పండి కోతలు ప్రారంభ దశలో ఉన్నాయి. పంటకు ఆరుతడి నీరు అందితే సరిపోతుంది. ఇటువంటి తరుణంలో తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల ధాటికి పంట నేలకొరిగి నీట మునిగి నష్టాన్ని తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తేరుకున్న దశలో..

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో వర్షాలు పడలేదు.అయినప్పటికీ కొన్నిచోట్ల వంశధార కాలువల ద్వారా సాగునీరు అందడంతో వరినాట్లు వేశారు. ప్రస్తుతం పంటలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు సైతం నీటమునిగి కూడా తేరుకున్నాయి. పొట్టదశ, కోత దశకు చేరుకున్నాయి.

అక్టోబర్‌ అంటేనే గుబులు..

అక్టోబర్‌ వచ్చిందంటే చాలు అన్నదాత గుండెల్లో గుబులు మొదలవుతుంది. గతంలో సూపర్‌సైక్లోన్‌, హుదూద్‌, తిత్లీ, పైలీన్‌, దానా, ముంథా వంటి భారీ తుఫాన్లు రైతులను నట్టేట ముంచేశాయి. ఇప్పుడు కూడా అర్నబ్‌ రూపంలో తుఫాన్‌ ముంచుకొస్తుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు.

గతంలో అక్టోబర్‌ నెల లోనే ఎక్కువగా తుఫా న్లు వచ్చి తీవ్ర పంట నష్టం మిగిల్చాయి. ఇప్పుడు కూడా అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు పడితే చేతికి వచ్చే పంట తుఫాన్‌ వస్తే పంట చేజారిపోవడం ఖాయం.

– కొవగాపు నవీన్‌,

రైతు, గార్లపాడు

రానున్న రెండు రోజుల్లో తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరిచేను కోతలను వాయిదా వేసుకోవాలి. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు ముందుకు సాగాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి.

– బి.సంధ్య, వ్యవసాయాధికారి,

హిరమండలం

అర్నబ్‌ తుఫాన్‌ హెచ్చరికలతో ఆందోళన

వరి పంటకు పొంచి ఉన్న ముప్పు

వెన్ను దశలో

ఉన్న వరిచేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement