● పండగ చేసుకున్న మందుబాబులు
● దసరా, స్థానిక సంస్థల ఎన్నికలే కారణం
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లాలో గత 10 రోజుల్లో మద్యం ప్రియులు ఏకంగా రూ. 39 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ఓ వైపు దసరా పండగ.. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో మద్యం బాబులు పండగ చేసుకున్నారు. అక్టోబరు 14 నుంచి 24 వరకు చూసుకుంటే 20,024 బీరు కేస్‌లు(బాక్సులు) అమ్ముడవ్వగా, ఐఎంఎల్ (లిక్కర్) కేస్‌లు (బాక్సులు) ఏకంగా 53,833 అమ్ముడుపోయినట్లు జిల్లా ఎకై ్సజ్ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
47 కేసుల్లో 48 మంది అరెస్టు..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ జిల్లాలో విస్తృతంగా దాడులు నిర్వహించిందని అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు వెల్లడించారు. కోడ్ సమయం నుంచి సోమవారం వరకు 47 కేసులు నమోదు చేసి 48 మంది నిందితులను అరెస్టు చేసి 150 లీటర్ల నాటుసారా, 56.87 లీటర్ల అక్రమ మద్యం, 9.28 లీటర్ల ఒడిశా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కవిటి మండలం పెద్దకర్రివానిపాలెంలో గుళ్ల పార్వతి వద్ద నుంచి 600 ఒడిశా సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని, సారాయిని రవాణా చేసినా, నిల్వలు కలిగివున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ జిల్లా అధికారి సీహెచ్ తిరుపతినాయుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ పల్లి మురళీధర్, సీఐలు ఎం.శ్రీనివాసరావు, రమణమూర్తి, ఎస్.సుజాత పాల్గొన్నారు.


