శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ పారా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం కార్యదర్శి డి.అచ్యుతరావు, ఉపాధ్యక్షులు ఎన్.గిరిధర్, సభ్యులు ఎన్.స్రవంతి సోమవారం తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. జిల్లాలో ఉన్న (దివ్యాంగ) పారా క్రీడాకారులు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ నెల 28లోగా 91776 93836, 97015 38328 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇరిగేషన్ ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దీర్ఘకాలికంగా ఇరిగేషన్ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఏపీ ఎన్జీవో ఇరిగేషన్ కమిటీ నాయకులు సోమవారం ఇరిగేషన్ ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌కు తెలియజేశారు. ఈ మేరకు విశాఖపట్నం కలెక్టరేట్ ఆవరణలో ఎన్జీవో సంఘ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్ ఏపీఎన్జీవో, శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యులు సమస్యలు వివరించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను, గర్భిణులను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులను విధుల నుంచి మినహాయించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మహిళలకు సొంత మండలం, పక్క మండలంలో మాత్రమే ఎన్నికల విధుల్లో వేయాలని విజ్ఞప్తి చేశారు. కారక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లండ బాబూరావు, బమ్మిడి శ్రీరామమూర్తి జిల్లా కార్యదర్శులు బి.రవికుమార్, జి.సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.నారాయణరావు ఎల్.కోదండ రామయ్య, శ్రీరామచంద్రమూర్తి, ఐ.రామారావు తదితరులు పాల్గొన్నారు.
గార: ఎస్‌జీటీలకు పోలింగ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి మినహాయించాలని, కేడర్ క్రమానుసారం బాధ్యతలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరామ్‌ప్రసాద్ కోరారు. ఈ మేరకు సోమవారం గార ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. స్కూల్ అసిస్టెంట్లను విడిచిపెట్టి అత్యధిక సంఖ్యలో ఎస్‌జీటీలను పీఓలుగా నియమించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఏపీయూఎస్ సభ్యులు కె.శ్రీనివాస్, డీజీ మోహనరావు, పి.తారక్ తదితరులు పాల్గొన్నారు.


