వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

టెక్కలి రూరల్‌: ప్రైవేట్‌ బస్సు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని బస్సు నుంచి జారిపడి తీవ్రగాయాల పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఐలా లలిత రాగోలులో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. సోమవారం ఉదయం తండ్రితో కలిసి కె.కొత్తూరు గ్రామానికి బస్సు ఎక్కేందుకు వచ్చింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఎక్కించి తండ్రి వెళ్లిపోయాడు. బస్సులో కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో ఒక బల్లవేసి దానిపై కూర్చోబెట్టారు. కోటబొమ్మాళి వద్దకు వచ్చేసరికి బస్సు ఒక్కసారిగా మలుపు తిప్పడంతో విద్యార్థిని బస్సు నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు.

పరామర్శకు

వెళ్తుండగా..

టెక్కలి రూరల్‌: లచ్చన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యా యి. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన టి.వెంకటరమణ ద్విచక్రవాహనంపై టెక్కలిలో బంధువుల ఇంటికి పరామర్శకి బయలుదేరాడు. లచ్చన్నపేట సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి గుర్తు తెలియని వ్యాన్‌ ఢీకొని వెళ్లిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.

రైలు ఢీకొని..

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వేస్టేషన్‌ వద్ద సోమవారం రాత్రి రైలు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలనాయి. వింజాంపాడు గ్రామానికి చెందిన హనుమంతు కసవయ్య తిలారు రైల్వేస్టేషన్‌ వద్దకు వెళ్లాడు. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో అటుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించి 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement