● పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
ఇచ్ఛాపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలని, కూటమి ప్రభుత్వంపై గెలవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సమాన్య ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు. సంక్షేమ పథకాలు అమలులో వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ పిరియా విజయ, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర, మాజీ ఎంపీపీలు బోర పుష్ప, డాక్టర్ నిమ్మన దాసు, కడియాల ప్రకాశ్, ఇప్పిలి కృష్ణారావు, చాట్ల తులసీదాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పార్టీకి విజయం అందించండి’
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌తోపాటు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి విజయం తెచ్చిపెట్టేలా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. సోమవారం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పలాసలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మాజీమంత్రి సీదిరితో చర్చించారు. 36వార్డుల ప్రజలతో అనునిత్యం మమేకమవ్వాలని ధర్మాన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.


