పోలాకి: మబగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్సార్సీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని జొన్నాం గ్రామస్తులు స్పష్టం చేశారు. యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య ఆధ్వర్వంలో సోమవారం జొన్నాం గ్రామానికి చెందిన 100 మందికి పైగా వైఎస్సార్ సీపీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ధర్మాన సోదరులు చేసిన అభివృద్ధి తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. భవిష్యత్లో సైతం ఎలాంటి సంక్షేమం ఇవ్వలేరని భావించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గ్రామస్తులకు పరిచయం చేశారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, నాయకులు చింతు రాఘవరావు, కణితి సత్తిబాబు, బోర శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


