‘కూటమి’ కొట్టుకుపోవడం ఖాయం | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ కొట్టుకుపోవడం ఖాయం

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

వైఎస్సార్‌ సీపీలో చేరికలే ఇందుకు

నిదర్శనం

ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌

ఆమదాలవలస రూరల్‌ : వైఎస్సార్‌ సీపీ ప్రభంజన వరదలో కూటమి పార్టీ కొట్టుకుపోవటం ఖాయమని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఆమదాలవలస మండలం నిమ్మతొర్లివాడలో 20 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులకు చేరికలు ఎంతో భయం పుట్టిస్తున్నాయని చెప్పారు. మన పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయటంతో గెలుపు మనదేనని తేటతెల్లమైందని, అందుకే కూటమి పాలకులు లేనిపోని కుట్రలు చేస్తున్నారని ఆమండిపడ్డారు. టీడీపీ నుంచి అధికంగా వలసలు రావటం వారికి భయం పుట్టిస్తోందని చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో గెలుపు దాదాపు ఖాయమైందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అండగా నిలుస్తానని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బెండి గోవిందరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు తమ్మినేని శ్రీరామూర్తి, జెడ్పీటీసీ అభ్యర్థి సనపల పద్మావతి, గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement