న్యూస్‌రీల్
శ్రీకాకుళం కార్పొరేషన్ జనసేనకు కేటాయింపుతో షాక్‌లో తెలుగు తమ్ముళ్లు
శ్రీకాకుళం
వైఎస్సార్సీపీలో చేరికలువైఎస్సార్సీపీలో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. స్థానిక పోరు వేళ ఇది ఉత్సాహాన్నిస్తోంది. –IIలో
సిక్కోలు తమ్ముళ్లకు
● పలాసలో తీవ్ర అసమ్మతి సెగలు
● అధిష్టానం మోసం చేసిందని ఇండిపెండెంట్‌గా నామినేషన్లు
● ఇప్పటికే సిద్ధమైన నలుగురైదుగురు
● జిల్లాలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ
● కోడ్ వర్తించదా.?
● కళింగ వైశ్యులకు షాకిచ్చిన టీడీపీ
● శ్రీకాకుళం జనసేనకు కేటాయింపు
● తాజాగా పలాస–కాశీబుగ్గలోనూ మోసం
● నిరాశతో రగిలిపోతున్న కళింగ వైశ్యులు
కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాల ఆదాయం రూ.27,09,639
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించిన జాతర ఉత్సవాల సందర్భంగా భక్తుల నుంచి వివిధ రూ పాల్లో రూ.27,09,639లు ఆదాయం వచ్చినట్లు ఈఓ వి.రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ సహాయ కమిషనర్ బీఆర్‌వీవీ ప్రసాద్‌పట్నాయక్, ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు, సభ్యుడు బోయిన రమేష్ పర్యవేక్షణలో శుక్రవా రం హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు.
శనివారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి అమానుషం
● తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీల్లో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమని, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మబగాంలో ఆయన శు క్రవారం విలేకరులతో మాట్లాడారు. పురపాలికల్లో మొదటి రోజు నామినేషన్ల సందర్భంగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపైనా, రాయచోటిలో పార్టీ కార్యాలయంపైన, పలువురు వైఎస్సార్సీపీ నాయకులపైనా వెన్ను పోటు పార్టీ గూండాలు దాడులకు దిగడాన్ని కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడాన్ని తప్పు పట్టారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పోలీసులు తగిన రక్షణ ఇవ్వాలని డిమాండ్ చే శారు. ఓటమి భయంతో టీడీపీ వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు కేంద్ర బలగాలను నియమించాలని వారి రక్షణలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
● మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన మాజీ స్పీకర్ తమ్మినేని
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించి ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు మున్సిపాలిటీలో ఎక్కడో ఒక దగ్గర ఓటర్‌గా నమోదై ఉండాలన్నారు. ఈ నామినేషన్ల ప్రక్రి య మరో రెండు రోజులపాటు కొనసాగుతుందన్నారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే ఎన్నికల అధికారి వద్దకు వెళ్లడానికి అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఆశావహులు లబోదిబో
ఆశావహులైతే అంతర్గత సంభాషణలతో లబోదిబోమంటున్నారు. తమ్ముళ్ల ముఖాల్లో కళ లేకుండా పోయింది. అసలు శ్రీకాకుళం నగరంలో జనసేన ఎక్కడుంది? వారికున్న నాయకులు ఎంతమంది? మేయర్‌కు పోటీ చేసేంత సత్తా ఎవరికుంది? ధనబలం ఉంటే ఉండొచ్చు.. జనబలం ఎక్కడిదని వారిలో వారు అనుకుంటున్నారు. ఒక్క మేయర్‌తో పోదని, రేపు డివిజన్లు కావాలంటారని, అప్పుడెంతమంది త్యాగం చేయాల్సి వస్తుందోనని వారిలో వారు బాధలు చెప్పుకుంటున్నారు. గెలిచేంత సీన్ ఉందా? ఓడిపోతున్న మేయర్ స్థానం జనసేన ఖాతాలో వేసేస్తే మనకేం పోయిందనుకుందా? అని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం అలముకుంది. 16 ఏళ్లుగా ఎన్నికలు జరగని శ్రీకాకుళం కార్పొరేషన్‌ను ఈసారైనా పోటీ చేసి గెలవాలని ఆశలు పెట్టుకున్న నగర టీడీపీ నాయకులకు ఈ నిర్ణయం పెద్ద ఝలక్‌గా మారింది. పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, టిక్కెట్ ఆశావహులు ఊహించని పరిణామంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మేయర్‌గా పోటీ చేసే అవకాశం జనసేనకు దక్కడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు మునిగిపోయారు.
కూటమిలో సెగ..
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో సెగ రాజుకుంది. సీట్ల సర్దుబాటులో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేగింది. దశాబ్దాలకు పైగా పార్టీని నమ్ముకుని, క్షేత్రస్థాయిలో పోరాడుతున్న నగర టీడీపీ నాయకులకు ఈ నిర్ణయం గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. తాజా కేటాయింపులు కోలుకోలేని దెబ్బతీయడమే కాకుండా తమ కష్టం, శ్రమ ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైపోయిందని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఊహించని ఈ పరిణామంతో నాయకులంతా ఒక్కసారిగా కోమాలోకి వెళ్లినంతగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.
పాటించాలా..
వ్యతిరేకించాలా..
శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. గత కొన్ని నెలలుగా వ్యూహాలను రచిస్తూ వస్తోంది. ఎంతో కాలంగా మేయర్ పీఠంపై కన్నేసిన సీనియర్ నేతలకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. పార్టీ కోసం ఇన్నేళ్లు శ్రమించిన తమను కాదని జనసేనకు కేటాయించడంపై అంతర్గతంగా రగిలిపోతున్నారు. కూటమి ధర్మాన్ని పాటించాలా లేదంటే స్థానిక క్యాడర్ మనోభావాలను గౌరవించాలా అనే సందిగ్ధంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పడిపోయారు. బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని జనసేనకు మద్దతుగా మాట్లాడలేక నాయకులు వ్యూహాత్మక మౌనం వహించారు.
వరం ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి..?
మేయర్ పదవి కోసం గంపెడాశలు పెట్టుకుని, ఆ పార్టీ ముఖ్యనేతలు ఇచ్చిన హామీతో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన అంధవరపు వరం ఫ్యామిలీకి ఆ పార్టీ అధిష్టానం కోలుకోలేని దెబ్బకొట్టింది. మాటిచ్చి మోసం చేసినట్టు అయింది. ఇప్పటికే చేతి చమురు ఖర్చు పెట్టించి, నానా హడావుడి చేయించి, తీరా సమయం వచ్చేసరికి మొండి చేయి చూపడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పైడిశెటి జయంతి, ప్రసాద్, సంతోష్ ఉన్నారు. ఇప్పుడు వారి భవిష్యతేంటి? తర్వాత ఏ రకమైన అడుగులు వేస్తారు? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. వీరే కాదు ఆశలు పెట్టుకున్న మరో 15 మందికి నోట మాట రావడం లేదు. పోటీపడి విజ్ఞప్తులు ఇచ్చారు. ఎవరికి వారు పైరవీలు, లాబీయింగ్ చేశారు. ఒకరికి తెలియకుండా ఒకరికి ముఖ్యనేతలు కూడా హామీలు ఇచ్చారు. కొందరి నుంచైతే తాంబూలాలు కూడా తీసేసుకున్నారు. ఏం చేసినా లాభం లేకపోయింది.
నేనేం తప్పు చేశాను..?
కాశీబుగ్గ: ‘ఏం తప్పుచేశానని పక్కన బెట్టారు? అన్ని వేళలా ఎమ్మెల్యేకు అండగా ఉండటమే చేసిన నేరమా?’ అంటూ పలాస–కాశీబుగ్గకు చెందిన టీడీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ కన్నీరుమున్నీరయ్యారు. తన కుమార్తెకు టికెట్ వస్తుందని ఆశించినా రాకపోవడంతో రెబెల్‌గా శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ‘ఎవరొచ్చినా వినేది లేదు.. బరిలోనే తేల్చుకుంటా’ అని తెగేసి చెప్పారు.
మెట్టూరు, కొత్తూరు, పారాపురం, గూనభద్ర ఆర్ఆర్ కాలనీ, మాతల, నివగాం లతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయడం లేదు. గ్రామాల్లో అధికార పార్టీ నేతల ఫొటోలను ముట్టుకోవడానికి కూడా సాహసించడం లేదు. ప్రభుత్వ పథకాలు, నిర్మాణాలు తదితర వాటికి సంబంధించిన పోస్టర్లు, కట్ అవుట్లు అలాగే వదిలేస్తున్నారు. – కొత్తూరు
కోడ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన కళింగ వైశ్య(కోమట్ల)లకు టీడీపీ వరుస షాకులిస్తోంది. స్థానిక సంస్థల్లో అందలం ఎక్కిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి తీరా సమయం వచ్చాక తెప్ప తగలేసింది. అటు శ్రీకాకుళం కార్పొరేషన్లో, ఇటు పలాస మున్సిపాలిటీలో కళింగ వైశ్యులెవరూ పోటీలో లేకుండా దెబ్బ తీసింది. తాజాగా జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవులకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇచ్ఛాపురానికి రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ఆసి లీలారాణిని ఎంపిక చేయగా, పలాస– కాశీబుగ్గకు వజ్జ గంగాభవానీని ఖరారు చేసింది. ఈ పేర్లు ఖరారు కాగానే రెండుచోట్లా అసమ్మతి రేగింది.
ఇప్పటికే కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అంధవరపు వరం కుమార్తె జయంతికి శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్‌గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఊరిస్తూ ఉసూరుమనిపించింది. సాధారణ ఎన్నికల్లో వాడుకుని, చేతి చమురు ఖర్చు పెట్టించి, ఊహల్లో తిప్పుతూ చివరికి చేతులేత్తేసింది. వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఏకంగా కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించింది. ఇప్పుడు పలాస– కాశీబుగ్గ మున్సిపాలిటీలోనూ కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలాస క్యాజ్యూ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు సతీమణి , మాజీ కౌన్సిలర్ లతకు గాని, కోడలు రోజాకి గాని ఇస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. దాదాపు ఖరారు చేసే సమయంలో జిల్లాకు చెందిన ముఖ్యనేత రంగంలోకి దిగి మొత్తం సీన్ మార్చేశారు. జిల్లాలో కళింగ వైశ్యులను ఎన్నికల ఖర్చు కోసం, ఇతర వ్యాపారాల కోసం వాడుకున్న వ్యక్తే హ్యాండ్ ఇచ్చేశారు. చివరి నిమిషంలో రేసులో ఉన్న మల్లా శ్రీనివాస్ ఫ్యామిలీని పక్కన పెట్టి వజ్జ బాబూరావు సతీమణి వజ్జ గంగా భవానీ పేరును ఖరారు చేశారు. వాస్తవంగా వజ్జ బాబూరావుకు ఇప్పటికే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ చైర్మన్ పదవి ఉంది. అంతేకాకుండా లిక్కర్ వ్యాపారంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాలను జిల్లాలో తొలిసారి ప్రవేశపెట్టింది ఆయనే అన్న ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో అన్ని రకాలుగా హవా సాగిస్తూ, ప్రయోజనాలు పొందుతున్న వజ్జ బాబూరావు ఫ్యామిలీకే మున్సిపల్ చైర్పర్సన్ పదవికి పోటీ చేసే అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగులే ఉల్లంఘిస్తుంటే..
ఎన్నికలు కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారిౖపైనెనా ఎన్నికల కమిషన్ చర్యలకు వెనుకాడకూడదు. కానీ ఆమదాలవలస మండల పురపాలక సంఘ పరిధిలో ఎన్నికల సంఘం నిబంధనలు అధికారులకు పూర్తిగా పట్టడం లేదు. వందల సంఖ్యలో హోర్డింగులు కళ్ల ముందే కనిపిస్తున్నా వారు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
–ఆమదాలవలస రూరల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అయితే తొలిరోజే టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో తలెత్తిన తీవ్ర అసమ్మతి కారణంగా రెబెల్స్ మోత మోగింది. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు అధిష్టానం నిర్ణయంపై తిరుగుబావుటా ఎగురవేశారు. అధికారిక అభ్యర్థులకు పోటీగా రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అటు చైర్‌పర్సన్‌కు, ఇటు వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు మున్సిపాలిటీల్లో కలిపి చైర్‌పర్సన్‌కు ఐదు, వార్డులకు ఏడు నామినేషన్లు పడ్డాయి.
ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెండు నామినేషన్లు దాఖలవ్వగా, వార్డులకు ఐదు నామినేషన్లు పడ్డాయి.
పలాస చైర్‌పర్సన్‌కు మూడు నామినేషన్లు, వార్డులకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
ట్రెండ్ చూస్తుంటే టీడీపీకి రెబెల్ పోటు ఎక్కువగా కనబడుతోంది. అధిష్టానం నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ, కంట తడిపెడుతూ, ఉద్వేగానికి లోనై ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు.
ఇక్కడితో ఆగిపోయేలా లేదు. మున్ముందు మరికొంతమంది టీడీపీ రెబెల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ కుమార్తె శ్రీజ రెబెల్‌గా నామినేషన్ వేశారు. ఆమెతో పాటు శ్రీకాంత్ కూడా 20వ వార్డు కౌన్సిలర్ పదవికి రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అదే పార్టీకి చెందిన బుల్లి లక్ష్మీ ప్రధాన్ కూడా చైర్పర్సన్ పదవికి టీడీపీ రెబెల్‌గా నామినేషన్ వేశారు.
శనివారం మరికొంతమంది టీడీపీకి చెందిన రెబెల్‌గా నామినేషన్ వేసే అవకాశం ఉంది.
25వ వార్డు నుంచి రిటైరైన అధికారిణి వైవీ మహలక్ష్మీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఆమె రెబెల్‌గా నామినేషన్ వేసే అవకాశం ఉంది.
3వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడి టీడీపీ ఆశావహుడు రెబెల్‌గా నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరో నలుగురైదుగురు రెబెల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
సైలెంట్ మోడ్‌లోకి ఆశావహులు
మౌనవ్రతంలో ముఖ్య నేతలు
వరం ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ


