శ్రీకాకుళం: శ్రీకాకుళం మెప్మాలోని రిసోర్స్ పర్సన్లు ఎస్హెచ్జీలకు రెండు రోజుల కిందట స్థానిక శాసన సభ్యుడు గొండు శంకర్ చీరలు పంపిణీ చేయడం నగరంలో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా సందర్భంలో వీరికి చీరలు పంపిణీ చేసినట్లు తొలుత చెప్పిన మెప్మా అధికారులు అటు తరువాత శాసనసభ్యుల్ని మహిళలంతా యూనిఫామ్ల కోసం అడిగారని, అందు వల్లనే ఆయన సొంత ఖర్చులతో వాటిని అందజేశారని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ పరంగా యూనిఫారాలు సరఫరా చేయాల్సి ఉండగా స్థానిక సంస్థల వేళ యూనిఫాం పేరిట పసుపు రంగు చీరలు పంచడం చర్చనీయాంశమైంది. మెప్మా ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు ప్రస్తుతం యూనిఫాంలో పేరిట చీరలు అందుకున్న వారే నాయకత్వం వహించే పరిస్థితి ఉండడంతో వీరికి తాయిలాలుగా చీరలు అందించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
పేకాట కేసులో 71 మందికి బెయిల్
మెళియాపుట్టి : ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఓ కల్యాణ మండపంలో పేకాట ఆడుతూ ఇటీవల 71 మంది పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి శుక్రవారం గజపతి జిల్లా పర్లాఖిమిడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


