‘స్థానిక’ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారుల నియామకం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారుల నియామకం

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

అరసవల్లి: ‘స్థానిక’ ఎన్నికల సంగ్రామానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మండలాల వారీగా రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. వీరికి శనివారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీల ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహిస్తూనే.. అలాగే జెడ్పీటీసీల ఎన్నికలకు సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించేందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒకరు చొప్పున 30 మందిని నియమించారు. అలాగే మండలాల తహసీల్దార్లను, ఎంపీడీఓలను ఆయా మండలాలకు ఎంపీటీసీ ఎన్నికలకు సహాయ రిటర్నింగ్‌ అఽధికారులుగా పనిచేసేలా మండలానికి ఇద్దరు చొప్పున 30 మండలాలకు 60 మందిని నియమించారు. వీరికి జెడ్పీ సీఈఓ వెంకట్రామన్‌ సూచనలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement